టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తన కెరియర్లో చాలా సినిమాలు రిజెక్ట్ చేసింది. అందులో అనేక మూవీలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ అయ్యాయి. మరి రష్మిక రిజెక్ట్ చేసిన సినిమాలలో బాక్సా ఫీస్ దగ్గర అపజయాలను అందుకున్న సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. చరణ్ జోడిగా ఈ మూవీ లో పూజా హెగ్డే నటించింది. పూజా హెగ్డే పాత్రలో మొదట ఈ సినిమాలో రష్మికను అనుకున్నారట. కానీ ఆ పాత్రను ఆమె రిజెక్ట్ చేయడంతో అందులో పూజా హెగ్డే ను తీసుకున్నారట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇక తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ లో మొదట రష్మిక ను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆమె ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. దానితో అందులో పూజా హెగ్డే ను హీరోయిన్గా తీసుకున్నారు.


సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే తాజాగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రష్మికను మొదట హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి రష్మిక తప్పుతుంది. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా రష్మిక రిజెక్ట్ చేసిన ఈ మూడు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: