- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రధానంగా మన తెలుగు స్టార్ హీరో లు ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా కొనసాగుతున్నారు . ముఖ్యంగా వీరీలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. వార్ 2 ప్రశాంత్ నిల్ సినిమాల షూటింగు ల్లో బిజీ గా ఉన్నాడు . అలాగే మరో పక్క మరో స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా లో నటిస్తున్నాడు .. అయితే ప్రతి సమ్మర్ లో కూడా ఈ స్టార్ హీరోలు తమ షూటింగ్ ల‌కు బ్రేక్ ఇచ్చి మరి వెకేషన్స్ కు వెళుతూ ఉండేవారు .. అయితే ఈసారి మాత్రం ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరూ కూడా సమ్మర్ బ్రేక్ లేద ని కూడా అంటున్నారు .. ఇక దీని కి వారు కమిట్‌ అయినా సినిమాల ను త్వరగా పూర్తిచేయాల ని చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది ..


ఎన్టీఆర్ ముఖ్యం గా ఈ నెలలో ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా షూటింగుల్లో అడుగు పెట్టబోతున్నాడు .. ఇక దీంతో వచ్చే మే నెలలో కూడా ఈ సినిమా షూటింగ్ ఆపు లేకుండా బిజీ గా జరగబోతుంది .. అలాగే రామ్ చరణ్ కూడా పెద్ది సినిమా షూటింగ్ ను బ్రేక్ లేకుండా కంటిన్యూ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నాడు .. ఇక దీంతో ఈయన కూడా బ్రేకు నో చెబుతున్నాడు .. ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ సమ్మర్ కు బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్నడం తో అభిమానుల్లో కూడా ఈ సినిమా ల పై మరింత ఆసక్తి నెలకొంది .. ఇద్దరు అగ్ర హీరోలు ఈ సినిమాల తో బాక్సాఫీస్ దగ్గర రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: