టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీయర్లో చాలా సినిమాలను వదిలేశాడు. అలా తారక్ రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అలా తారక్ రిజెక్ట్ చేసిన మూవీలలో బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం భద్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథను మొదట బోయపాటి , తారక్ కి వినిపించాడట. ఆయన మాత్రం ఆ కథను రిజెక్ట్ చేశాడట. ఇక ఆ సినిమాలో రవితేజ హీరోగా నటించగా ... ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే సినిమా రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కథను భాస్కర్ మొదట తారక్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న ఆయన సినిమా స్టోరీ బాగానే ఉంది కానీ నాపై ఈ కథ వర్కౌట్ కాదు అని ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడట.


మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం కిక్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కథను మొదట సురేందర్ రెడ్డి , తారక్ కి వినిపించాడట. కానీ ఆయన ఈ మూవీ కథను రిజెక్ట్ చేశారట. ఇలా తారక్ రిజెక్ట్ చేసిన ఈ మూడు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: