- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రధానంగా మన భారతీయ చిత్ర పరిశ్రమ లో మలయాళ చిత్ర పరిశ్రమ ఎంతో భిన్నమైనది .. ఈ చిత్ర పరిశ్ర‌మ‌లో వచ్చే సినిమాలు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి .. ఈ చిత్ర పరిశ్రమలో ఉండే నటులు కూడా భిన్నంగా ఉంటారు .. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చిన నటులంతా టాలీవుడ్ లో ఓ మోస్తరు స్థాయిలో మెరిపించిన వాళ్లే .. మోహన్ లాల్ నుంచి మొదలుపెడితే పృధ్విరాజ్ సుకుమారన్ , టోవినో థామస్ , ఫహద్ ఫాజిల్ .. ఇలా కొంతమంది పేరులు మనం చెప్పుకోవచ్చు .. అయితే ఒక్కరు మాత్రం ఈ లిస్టులో కనిపించడం లేదు .. అతనే షైన్ టామ్ చాకో .. ఇక పైన చెప్పుకున్న న‌టులకు ఏమాత్రం తీసిపో టాలెంట్ ఉన్న నటుడు ఇతడు .. అలాగే కేరళలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది .  కానీ తెలుగు , తమిళ పరిశ్రమలకు వచ్చేసరికి తన స్థాయి పాత్రలో కనిపించడం లేదు ఈ నటుడు ..

 

ముఖ్యంగా ద‌స‌రా , రంగబల్లి లాంటి సినిమాల్లో మంచి పాత్రలో కనిపించిన ఈ  నటుడు , ఆ తర్వాత ఫుల్ లెన్త్ పాత్రలో నటించడం మానేశాడు  .. అలా అని గ్యాప్ తీసుకోలేదు చిన్నాచితక‌ పాత్రలు చేస్తూ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు .. ఇక మొన్నటికి మొన్న బాలయ్య డాకు మహారాజ్ లో ఇతని పాత్ర ఎంతో చిన్నది.. అలాగే రాబిన్ హూడ్‌ సినిమాలో కూడా అంతకంటే దారుణమైన క్యారెక్టర్ .. అలాగే ఇలాంటి పాత్రలు చేస్తున్నాడేంటి అనుకునే లోపేపే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లి సినిమాలో కనిపించాడు .. కేవలం ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించి ఆదోరకంగా నటించి వెళ్ళిపోతాడు .. ఇకపై తెలుగు , తమిళ ఇండస్ట్రీలో చాకో ఇలాంటి చిన్న చిన్న పాత్రలో నటించకుండా ఉంటే మంచిదని కూడా ఆయన అభిమానులు అంటున్నారు .. ఇకనైనా తన స్థాయికి తన క్యారెక్టర్ కు తగా సినిమాల్లో నటించాలని కూడా కోరుకుంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: