డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం దిల్ రాజు ఓ వైపు సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కంటిన్యూ అవుతూనే మరో వైపు డిస్ట్రిబ్యూటర్ గా కూడా కొనసాగుతున్నాడు. కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు కి మీరు నిర్మాతగా కాకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే కొనసాగి ఉండుంటే ఇన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండేవారా అనే ప్రశ్న ఎదురయింది.

దీనికి దిల్ రాజు సమాధానం చెబుతూ ... కచ్చితంగా నేను నిర్మాతగా కాకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగి ఉండుంటే ఇన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే అందుకు ఒక ఉదాహరణను కూడా చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... నేను 2017 వ సంవత్సరం అనేక సినిమాలను నిర్మించాను. అలాగే కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించాను. ఆ సంవత్సరం నేను డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేసిన సినిమాలలో స్పైడర్ , అజ్ఞాతవాసి మూవీలు కూడా ఉన్నాయి.

ఆ సినిమాలను నేను భారీ ధరకు కొన్నాను. ఆ మూవీల ద్వారా నాకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయి. కానీ అదే సంవత్సరం నేను నిర్మించిన సినిమాలు భారీ విజయాలను సాధించడంతో నాకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. దానితో నాకు నిర్మాతగా వచ్చిన లాభాలు , నేను డిస్ట్రిబ్యూటర్ గా తెచ్చుకున్న నష్టాలను పూడ్చగలిగాయి. అందుకే నేను డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా కొనసాగుతున్నాను కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: