ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న మీడియం రేంజ్ హీరోలలో నాని ముందు వరసలో ఉన్నాడు అనడంలో ఏ మాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో నాని నటించిన చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం నాని , శైలిష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలను సాధించి ఉండడంతో హాట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

నాని ఇప్పటికే తనకు దసరా మూవీతో మంచి విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటించడానికి కూడా కమిట్ అయ్యాడు. ఈ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను మే 2 వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఓ చిన్న గ్లీమ్స్ వీడియోని విడుదల చేయగా అది అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఇలా ప్రస్తుతం ఓ మూవీ లో నటిస్తూ మరో మూవీ ని మొదలు పెట్టడానికి రెడీగా ఉన్న నాని మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ దర్శకులలో ఒకరు అయినటువంటి సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి నాని కమిట్ అయినట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజిత్ , పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే నానితో సుజిత్ మూవీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: