ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు స్టార్ హీరోస్ చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బడాబడా స్టార్స్ నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి . చిన్నచితిక హీరోలు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి . హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే పాపం పెద్ద స్టార్ హీరోని నమ్ముకుని కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి ఆశలన్నీ ఆ స్టార్ హీరోల పైన పెట్టుకున్న మేకర్స్ పరిస్థితి అల్లకల్లోలంగా తయారైపోతుంది . స్టార్ హీరోస్ నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతూ ఉండడంతో స్టార్స్ తో సినిమా అంటే భయపడిపోతున్నారు జనాలు.


హీరోలు మాత్రం సేఫ్ సినిమా . హిట్ అయినప్పుడు ఫ్లాప్ అయినప్పుడు ఏ ప్రాబ్లం లేదు . మార్కెట్ ప్రకారం రెమ్యూనరేషన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు . వాళ్ళను నమ్మి ప్రాజెక్టుపై డబ్బులు పెట్టిన వాళ్ళకి అసలు కష్టం అంత . ఈ మధ్యకాలంలో శర్వానంద్ - వరుణ్ తేజ్ - నితిన్ - గోపీచంద్ కి అసలు హిట్ కొట్టిందే లేదు . కానీ రెమ్యూనరేషన్ మాత్రం కోట్లకు కోట్లు బాగానే తీసుకుంటున్నారు . వీళ్ళపై ఖర్చు చేసిన డబ్బులు అసలు మేకర్స్ కి రూపాయి కూడా ఆదాయం లేదు . ఈ క్రమంలోనే చాలామంది మేకర్స్ వీళ్ళ మూవీస్ విషయంలో ఫైర్ అయిపోతున్నారు.



అయితే చాలామంది ఈ విషయాన్ని కాంట్రవర్షియల్ గా మార్చేస్తున్నారు. స్టార్ హీరోస్ కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయకుండా వెధవలను చేస్తున్నారా..? అంటూ ఘాటుఘటుగా స్పందిస్తున్నారు . సోషల్ మీడియా లో ప్రజెంట్ ఇది ఒక హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది. సినిమా హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. అయితే ఆ సినిమాని హిట్ చేసే బాధ్యత కూడా హీరో చేతుల్లో ఉంటుంది . ఎప్పుడు ఒకే కధా కంటెంట్ సినిమాలు చేస్తే జనాలు చూడరు. చిన్న హీరోస్ ఎంత తెలివిగా సబ్జెక్టుకి సబ్జెక్టుకి డిఫరెన్స్ చూపిస్తున్నారు . అదేవిధంగా స్టార్స్ కూడా చూపిస్తే బాగుంటుంది అంటున్నారు సినీ ప్రముఖులు. చూద్దాం మరి ఈ హీరోస్ నెక్స్ట్ నటించే సినిమాల విషయంలోనైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని హిట్ కొడతారేమో..??

మరింత సమాచారం తెలుసుకోండి: