తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. మొదటి విజయాన్ని మిరపకాయ్ సినిమాతో అందుకున్నాడు. మొదటి బ్లాక్ బాస్టర్ను గబ్బర్ సింగ్ సినిమాతో సొంతం చేసుకున్నాడు. ఇకపోతే చాలా కాలం క్రితం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక పవన్ రాజకీయ పనులతో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

దానితో హరీష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా పనులను పక్కన పెట్టి రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను రూపొందించాడు. కొంత కాలం క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి భారీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ రీ స్టార్ట్ కాకపోవడంతో హరీష్ శంకర్ వేరే హీరోలతో సినిమాలకు కమిట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి సంస్థలో సల్మాన్ ఖాన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హరీష్ శంకర్ , సల్మాన్ కి ఓ కథను వినిపించగా ఆ కథ నచ్చడంతో సల్మాన్ కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే హరీష్ శంకర్ ప్రస్తుతం బాలకృష్ణ కోసం ప్రస్తుతం ఓ కథను రెడీ చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే దానిని బాలకృష్ణకు వినిపించనున్నట్లు , ఒక వేళ హరీష్ శంకర్ చెప్పిన కథ బాలయ్యకు నచ్చినట్లయితే హరీష్ , బాలయ్య కాంబోలో కూడా మూవీ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇలా హరీష్ శంకర్ వరస సినిమాలను లైన్లో పెడుతూ ఫుల్ జోష్లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: