కొన్ని దశాబ్దాల కిందట సినిమా ఫీల్డ్ లోకి అమ్మాయిలు రావడమే బహుకష్టం.. అలాంటిది ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి  హీరోలతో సమానంగా పారితోషకం అందుకున్నారు సావిత్రి.. దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళ ఇండస్ట్రీ లను  ఒక ఊపు ఊపేశారని చెప్పవచ్చు. సావిత్రి షూటింగ్ స్పాట్లోకి వచ్చింది అంటే  తప్పనిసరిగా ఒక  అలజడి మొదలవుతుంది. ఆమె ఎలాంటి పాత్రలో అయినా నటించడం కాదు జీవించేస్తుంది. కళ్ళతోనే అన్ని హావాభావాలు పలికించగల గొప్ప నటిగా కీర్తి ప్రతిష్టలు పొందింది. అలాంటి మహానటి ఇండస్ట్రీలో ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో  ఆ విధంగానే తన చివరి రోజులు నరకాన్ని అనుభవించింది. 

దగ్గరి వాళ్లే మోసం చేసి ఆస్తులన్నీ  లాగేసుకొని ఆమెను అనాధలా చేశారు. అలాంటి సావిత్రి కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక హీరో వల్ల చాలా ఏడ్చిందట. ఆ హీరో ఎవరు వివరాలు చూద్దాం.. అప్పట్లో సావిత్రి ఏఎన్ఆర్ తో అనేక సినిమాల్లో నటించేది. అన్నపూర్ణ బ్యానర్ లో  సినిమా వస్తుంది అంటే తప్పకుండా సావిత్రి హీరోయిన్ గా ఉండేది.  అంతేకాదు తానే హీరోయిన్ గా ఉండాలని  నియమం కూడా పెట్టుకుందట. అలాంటి సావిత్రి లేకుండా ఆ ఒక్క సినిమా బయటకు రావడంతో ఆమె చాలా బాధపడిందట.

సినిమా ఏంటయ్యా అంటే ఇద్దరు మిత్రులు. అయితే ఇందులో ఏఎన్ఆర్ డబల్ యాక్షన్  పాత్రలో నటించారు. అంతేకాదు ఇందులో సావిత్రి హీరోయిన్ అని చాలామంది అనుకున్నారు. చివరికి సరోజ, రాజా సులోచనను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో సావిత్రి చాలా బాధపడిపోయి, నన్ను మోసం చేశారంటూ దీనంగా కూర్చుని కన్నీరు పెట్టుకుందట. 1961 లో రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో, ఆమెను స్పెషల్ గెస్ట్ గా పిలిచి  100డేస్ ఫంక్షన్ బహుమతులు అందించేలా చేశారట ఏఎన్నార్.

మరింత సమాచారం తెలుసుకోండి: