పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు .. కీర్తి సురేష్ కి పట్టిందల్లా దరిద్రంగానే తయారైపోతుంది.  కీర్తి సురేష్ అంటే మహానటిగా.. టాలెంటెడ్ డ్యూటీ గా బాగా పాపులారిటి సంపాదించుకుంది . తెలుగు ఇండస్ట్రీలో ఆమెను ఒక మహారాణి లా ట్రీట్ చేసే వాళ్ళు తెలుగు జనాలు.  కీర్తి సురేష్ నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం ఏ విధంగా డౌన్ ఫాల్ కాకుండా ముందుకు తీసుకెళ్లారు.  అయితే ఏ మూహుర్తానా ఆమె బాలీవుడ్లోకి అడుగుపెట్టిందో కానీ అప్పటినుంచి ఆమెకు అన్నిట్లోనూ నెగిటివిటి వచ్చేసింది.


శుభమా అంటూ పెళ్లి చేసుకున్న కూడా అది ట్రోల్ చేశారు.. మెడలో తాళి వేసుకుంటే ట్రోల్ చేశారు.. మెడలో తాళి తీసేస్తే ట్రోలింగ్ ..పెళ్లి ఫోటో షూట్ చూపిస్తే ట్రోలింగ్ ..ఒకటా రెండా పెళ్లి తర్వాత ప్రతి ఒక్క విషయంలో కాంట్రవర్షియాలిటీ ఎదుర్కొన్నింది కీర్తి సురేష్.  అయితే ఆమె పెళ్లి తర్వాత నటించిన "బేబీ జాన్" సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది.  కీర్తి సురేష్ కి ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావడం లేదు . కోలీవుడ్ జనాలు పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ లో వస్తున్న అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి .



దానితో టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తుంది కీర్తి సురేష్ . ఇలాంటి మూమెంట్లోనే ఆమె శాంతి పరిహార పూజలు చేయాలి అంటూ డిసైడ్ అయిందట . కీర్తి సురేష్ జాతకంలో ఒక దోషం ఉందని ఆ దోషం కారణంగానే ఇలా అవకాశాలు వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోతున్నాయి అని కీర్తి సురేష్ శాంతి పరిహార పూజలు చేస్తే వాటి అన్నిటికి సొల్యూషన్ దొరుకుతుంది అంటూ కుటుంబ పండితులు చెప్పిన కారణంగా కీర్తి సురేష్ స్పెషల్ పూజలు చేయాలి అంటూ డిసైడ్ అయ్యిందట . సోషల్ మీడియాలో ఇప్పుడు కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ గా మారింది. చూడాలి మరి ఈ పూజలు తరువాత అయిన కీర్తి సురేష్ కి కలిసి వస్తుంది ఏమో..??

మరింత సమాచారం తెలుసుకోండి: