మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు హైప్ పెరిగిన ఆ తర్వాత టీజర్ విడుదల చేయగా కొంతమేరకు నెగిటివ్ టాక్ వినిపించింది. దీంతో అప్పటినుంచి విశ్వంభర
 సినిమా పైన నెగటివ్ గానే వినిపిస్తూ ఉండేది. ముఖ్యంగా గ్రాఫిక్స్ పైన చిరంజీవి కూడా అసంతృప్తితో ఉన్నారని తిరిగి మళ్లీ రీ షూటింగ్ చేయమని వశిష్ట తో చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల వల్లే ఆలస్యం అవుతొందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష తో పాటుగా పలువురు హీరోయిన్స్ నటిస్తూ ఉన్నారు.


ఇలాంటి సమయంలో నిన్నటి రోజున విశ్వంభర సినిమా నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా స్పెషల్ సాంగ్ ఉంటుందంటూ పోస్టర్ని రిలీజ్ చేశారు. అన్నట్టుగానే  తాజాగా రామ రామ అనే పాటను కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. ఈ పాటని ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాట కూడా ప్రతి ఒక్కరిని హార్ట్ టచింగ్ చేసేలా కనిపిస్తూ ఉన్నది. భక్తితో ఆధ్యాత్మికంగా చాలా బాగా చూపించినట్లుగా కనిపిస్తోంది.


ఈ రామ రామ అనే పాటతో ఒక్కసారిగా విశ్వంభర సినిమాకి పాజిటివ్ వైస్ కనిపిస్తూ ఉన్నాయి. భారీ సెట్స్ మధ్య ఈ పాటని చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. చిరు చాలా భక్తితో కూడా ఈ పాటలో కనిపించడమే కాకుండా హనుమంతుడి పైన ఉండే ప్రేమను కూడా ఇందులో చూపించినట్లుగా కనిపిస్తోంది. రామ జోగయ్య శాస్త్రి రాసినటువంటి పదాలు కూడా చాలా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. యువి క్రియేషన్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. విశ్వంబర సినిమా విజువల్స్ స్క్రీన్ ప్రజెంటేషన్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: