ఈ మధ్యకాలంలో సినిమా కోసం ఏదైనా స్టంట్ చేయమంటేని "అమ్మో..ఇప్పుడు అవసరమా..?" అంటూ అలా చేయాలంటే ఆలోచిస్తున్నారు హీరోలు . అయితే టైర్ 2 చిన్నా చితకా హీరోలే అంత ఆలోచిస్తున్నా మూమెంట్లో పెద్ద బడాస్టార్ డైరెక్టర్  అడిగారు అని ఆ పనిచేయడానికి సై అన్నాడు ఓ హీరో.  ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్. ఆ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ . వీళ్లిద్దరి కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.


ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నందమూరి అభిమానులు . అయితే ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా చాలా స్పెషల్గా నిలిచిపోతుంది అంటూ మేకర్స్ మాట్లాడుతున్నారు . అంతే కాదు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో  ఎన్టీఆర్ ని చాలా న్యాచురల్ గా చూపించబోతున్నారట . అంతేకాకుండా క్యారెక్టర్ కి అనుగుణంగా ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో గుండు కొట్టుకొని కనిపించాలట. వేరే ఏదైనా డూప్లికేట్ ప్రోడక్ట్ పెడితే ఆయనకు ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుంది అన్న విధంగా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతున్న మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గుండు కొట్టుకుంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి సెట్ అయిపోతుందా..? ఓకే గుండు కొట్టించేసుకుంటాను అంటూ ఓపెన్గానే ప్రశాంత్ నీల్ కి ఆఫర్ ఇచ్చారట.



సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఒక స్టార్ హీరో గుండు కొట్టుకొని తిరగడం అనేది మామూలు విషయం కాదు.  అది కూడా ఒక సినిమా కోసం . ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్  కి సినిమాలపై ఉన్న ప్రేమ అని చెప్పాలి అంటున్నారు నందమూరి అభిమానులు . జూనియర్ ఎన్టీఆర్ కి ఇదేమి కొత్తది కాదు.  సినిమాల కోసం బరువు తగ్గమన్న తగ్గుతాడు పెరగమన్న పెరుగుతాడు అది అందరికీ తెలిసిందే. ఈ సినిమా  ఇజంగానే తారక్ లీఫ్ లో ఓ మైల్ స్టోన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పడం లో సందేహమే లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: