ఎస్ ప్రజెంట్ ఇప్పుడు అందరు ఇదే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . స్టైలిష్ స్టార్ ..అల్లు అర్జున్..పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాంటి  బన్నీలో లేనిది ఏంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు లో ఉన్నది ఏంటి..? ఎందుకు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ..పాన్ ఇండియా హీరో బన్నీ సినిమాని రిజెక్ట్ చేసింది ..? మహేష్ బాబు సినిమాని ఓకే చేసింది..? అంటూ మాట్లాడుకుంటున్నారు .  గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్ .


అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు ..? ఎవరు..? ఎవరు..? అంటూ పదే పదే సెర్చింగ్ మొదలుపెట్టారు . అయితే చాలామంది సమంత - జాన్వికపూర్ - రష్మిక అనుకున్నారు . కానీ ఇదంతా కాదు అని ప్రియాంక చోప్రా ని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అనుకుంటున్నారు అని ఓ టాక్ వినిపించింది . అట్లీ డైరెక్ట్ గా వెళ్లి కూడా మాట్లాడారుట ఆమెతీ..కానీ ప్రియాంక చోప్రా ఈ రోల్ ని రిజెక్ట్ చేసిందట.  ఆల్రెడీ మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న కారణంగా ఈ సినిమాని రిజెక్ట్ చేసిందో..? లేకపోతే వెరే ఏదైనా కారణమో తెలియదు కానీ ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ న్యూస్.



ప్రియాంక చోప్రా కావాలనే ఇలా చేసింది అని కొందరు.. మరి కొంత మంది మాత్రం బన్నీలో లేనిది మహేష్ బాబు లో ఉన్నది ఏంటి అంటూ వ్యయంగా వెటకారంగా ట్రోల్  చేస్తున్నారు. సాధారణంగా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న తరువాత ఏ హీరో కి ఇలాంటి పరిస్ధితి రాదు. మరి ఎందుకు బన్నీకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. పాపం బన్నీ ..ఇప్పుడు ఈ విషయం కారణంగా మళ్లీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతున్నాడు. ఆల్ రెడీ పుష్ప సినిమా కారణంగా ఆయన ఎంత ఇబ్బందులు ఎదురుకున్నాడో అందరికి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: