సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొందరి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ మిస్ అయిపోతూ ఉంటారు.  అలాంటి లిస్టులో మన రెబెల్ హీరో ప్రభాస్ కూడా ఉన్నారు. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఆరడుగుల అందగాడు. పాన్ ఇండియా లెవల్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న హీరో . ఎంతోమంది స్టార్ డైరెక్టర్ లు ఆయన తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కానీ ప్రభాస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే డైరెక్టర్ మాత్రం సుకుమార్ . కానీ ఎందుకో వీళ్ళ కాంబోలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సెట్ కాలేదు.


ప్రభాస్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ఒక్క సినిమా కూడా రాలేకపోయింది.  కానీ వీళ్ళ కాంబోలో సినిమాలు మాత్రం రావడానికి చాలా ట్రై చేశారు.  కానీ క్యాన్సిల్ అయిపోయాయి. అందులో ఒక్క  మూవీనే నాన్నకు ప్రేమతో . జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా సుకుమార్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తారక్ కెరియల్ లోనే స్పెషల్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మొదటగా హీరోగా సుకుమార్ ..స్టార్ హీరో ప్రభాస్ ని అనుకున్నారట .



ప్రభాస్ కటౌట్ కి క్యారెక్టర్ కి ఈ రోల్ బాగా సూట్ అవుతుంది అని ఆశపడ్డారట. కానీ ప్రభాస్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు.  ప్రభాస్ కి కథ నచ్చిన కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగానే ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.  అయితే ఈ సినిమాని స్పెషల్గా ప్రభాస్ కోసమే రాసుకున్నాడట సుకుమార్ . ఆయన రిజెక్ట్ చేయడంతో చాలా బాధపడ్డారట . ఆ తర్వాత చాలామంది హీరోస్ వద్దకి ఈ కధ వెళ్లింది.  ఫైనల్లీ జూనియర్ ఎన్టీఆర్ కి ఈ కథ రాసి పెట్టింది . ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు . ఈ సినిమా ఎప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి సో స్పెషల్ అనే చెప్పాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: