మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో రవితేజ ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన “మిస్టర్ బచ్చన్“ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం రవితేజ 'మాస్‌ జాతర' అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.మే 9న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలో రవితేజ సరసన క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ధమాకా “ సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా మాస్ జాతర నుంచి “తూ మేరా లవ్” సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది..

అయితే ఈ పాటలో రవితేజ కెరీర్ లోనే సూపర్ హిట్ సాంగ్ అయినా ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ సాంగ్ బీట్ ని యాడ్ చేసారు.. గతంలో రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఇడియట్’ మూవీలోని ఈ సాంగ్ రవితేజ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది.. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సాంగ్ బీట్ తో మరోసారి మాస్ రాజా రవితేజ మాస్ స్టెప్స్ వేయించనున్నాడు..ఈ పాట ఐకాన్ స్టెప్స్ రవితేజ మరోసారి రీ క్రియేట్ చేసారు.ఫుల్ సాంగ్ ని మేకర్స్ ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..మాస్ జాతర తో రవితేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: