టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో విజయాలు అందుకొని సూపర్ ఫామ్ లో ఉన్నాడు .. అలాంటిది సిద్దు నుంచి వచ్చిన జాక్‌ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది .. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్ల పరిస్థితి చూస్తే ఈ సినిమా పరిస్థితి ఏంటో చెబుతున్నాయి . కనీసం మినిమం ఓపెనింగ్ రాకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్‌కు గురి చేస్తున్నాయి . దర్శకుడుగా బొమ్మరిల్లు భాస్కర్ కి ఈ టైంలో విజయాలు లేకపోవచ్చు కానీ ఆయనకంటూ సపరేట్ మార్కు ఉంది .. అలాగే యూత్లో సిద్దుకు మంచి క్రేజ్‌ ఉంది ఆయన కోసమైనా జనాలు థియేటర్లకు రావాలి అది జరగలేదు.. సినిమాకు వచ్చిన వాళ్లు ఇదేం సినిమా రా బాబు అంటూ పెదవి విరుస్తున్నారు ..


అలాగే ఓ సినిమా ప్లాప్ అయ్యిందంటే అందరి వేళ్లు దర్శకుడు వైపే చూపిస్తాయి .  కానీ ఇక్కడ పరిస్థితి వేరు సిద్దు అన్ని విషయాల్లో వేలు పెట్టాడనేది ఇన్సైడ్ వర్గాల వాదన .. అలాగే ఈ సినిమాకు సంబంధించిన రెండు మూడు రోజుల షూటింగ్ దర్శకుడు లేకుండానే జరిగిందని కూడా ఓ వార్త బయటకు వచ్చింది .  డైరెక్టర్ భాస్కర్‌ కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా మాట్లాడారు .  అలాగే సిద్దు చాలా టాలెంటెడ్ తనకు అన్ని విషయాలు తెలుసు అలాంటప్పుడు ఇన్పుట్ చేయటంలో ఎలాంటి తప్పు లేదని ఇండైరెక్టుగానే తన ఇన్వాల్వ్మెంట్ ని ఒప్పుకున్నాడు .  


సిద్దు కూడా అదే మాట అనేసాడు ఇది నా సినిమా నేను జోక్యం చేసుకుంటే తప్పేంటి అని కూడా బయటవారిని నిలదీశాడు  .. అయితే ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ ఇద్దరికి వెళ్ళేది .. ప్లాఫ్ కాబట్టి ఇప్పుడు ఇద్దరూ పంచుకోవాల్సి  వస్తుంది .. కాకపోతే ఇక్కడ ఈ క్రెడిట్లో ఇంకొంచెం ఎక్కువ శాతం హీరో సిద్దు పైకి వెళ్ళిపోతుంది .. ఏ హీరో అయినా దర్శకుడిని తన పని తాను చేసుకునే అంత స్వేచ్ఛ ఇవ్వాలి .. అధిక ఇన్వాల్వ్మెంట్ సినిమా ఇన్పుట్ పై అధిక ఇంపాక్ట్ చూపిస్తుంది . జాక్ విషయంలో కూడా ఇదే జరిగింది .. దర్శకుడు భాస్కర్ కథని అతని క్యాపిబిలిటీని నమ్మి సిద్దు వదిలేయాల్సింది .. అప్పుడు ఫలితం అటు ఇటు అయితే సిద్దు ఇమేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయాడు అంటూ భాస్కర్ ని విమర్శించేవారు.. ఇప్పుడు సిద్దు ఇన్వాల్వ్మెంట్ వల్ల భాస్కర్ ని ఎవరు ఏమి అనటం లేదు .. అంతా కర్త కర్మ క్రియ అంతా సిద్దు అని ఒక్క మాటతో తేల్చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: