టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. అందులో కొంతమంది దర్శకులు మాత్రమే వారి సినిమాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో పాన్ ఇండియా స్టార్ దర్శకుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఇతను ఏదైనా సినిమాను ప్రారంభించాడంటే కాస్త ఆలస్యమైన సరే తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో నటించే హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు అందుకుంటారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. 


ఇక రాజమౌళి తన తదుపరి సినిమాను ఘట్టమనేని మహేష్ బాబుతో తీస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి - మహేష్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాలేవు. తాజాగా ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతుంది.

ఈ సినిమాను 2027 లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. మార్చి 25 లేదా 27న ఎస్ఎస్ఎంబి 29 సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం తెలిసి రాజమౌళి, మహేష్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని రికార్డుల మోత మోగిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.... ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇదివరకే ఈ బ్యూటీ సినిమా షూటింగ్లో పాల్గొందని టాక్ వినిపిస్తోంది.


ఈ సినిమాను పూర్తిస్థాయి అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. కాగా, ఈ సినిమాలో షూటింగ్ సన్నివేశాలు బయటకి లీక్ కాకుండా జక్కన్న స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారట. షూటింగ్ స్పాట్ లోకి ఎవరిని ఫోన్స్ కూడా అలో చేయడం లేదట. మహేష్ బాబు, రాజమౌళి సైతం షూటింగ్ సమయంలో ఫోన్ లని తీసుకెళ్లడం లేదట. కాగా ఈ సినిమా కోసం అభిమనులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: