మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఈ మెగా హీరో తన నటనతో ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకున్నాడు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. తన సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారారు. సినిమాల్లోకి వచ్చేవారికి మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా ఉంటారు.


ఇక చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుత మైన చిత్రాల లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాల ద్వారా విపరీతంగా డబ్బులను కూడా సంపాదించాడు. తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. తను నటనకు గాను చిరంజీవి ఎన్నో అవార్డులను సైతం అందుకుని గొప్ప స్థాయిలో నిలిచారు. ప్రస్తుతం ఈ హీ రో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను ఇదివరకే నిర్వహించారు.

కాగా ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఖరారు కాలేదు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేను రంగంలోకి దింపనున్నారట. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తుంది.

ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీను చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించినట్లయితే ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. దానికోసం భాగ్యశ్రీని ఇదివరకే సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ ప్రారంభించబోతున్నారట. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: