
ఇక్కడ షూటింగ్ అయితే సరిపోదు కదా దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరగాలి ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి షాట్ సిజి తో ముడి పడి ఉంటుంది .. అదంతా ఈజీగా తేలే వ్యవహారమైతే కాదు . అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల టాక్ ఏమిటంటే .. పవన్ నటించాల్సిన సీన్స్ లేకుండానే సినిమాని పూర్తి చేస్తున్నారట .. ఆ సీన్స్ పక్కన పెట్టి సినిమాని ముగిస్తే కంప్లైంట్ అవుతుందా, అతుకుల బంతులా ఉంటుందా ? అనేది పెద్ద ప్రశ్న .. షూటింగ్ కోసం డేట్లు ఇవ్వమని ఒత్తిడి తీసుకొచ్చి పొజిషన్లో నిర్మాత కానీ దర్శకుడు కానీ లేరు ..
పవన్ కళ్యాణ్ కనుకరిస్తే మహాభాగ్యమని స్థితిలో ఉన్నారు .. ఇదే క్రమంలో పవన్ చిన్న కుమారుడు ఇటీవల అగ్ని ప్రమాదాని కి గురై గాయాల పాలయ్యాడు .. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ను షూటింగ్ కి రమ్మనడం కూడా భావ్యం కాదు .. అయితే ఇప్పుడు మే 9న సినిమా రావాలంటే తీయాల్సిన ఆ సీన్స్ పక్కన పెట్టాలి ..లేదంటే మరో డేట్ చూసుకోవాలి .. మళ్లీ వాయిదా అంటే ఆ భారం నిర్మాత మోయడం కష్టం .. కాబట్టి మొదటి ఆప్షన్ ఎంచుకొనే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు ..