- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ డైరెక్టర్ శ్రీవాస్ గోపీచంద్ తో చేసిన రామబాణం తర్వాత నుంచి మరో సినిమా ప్రకటించలేదు .  అయితే ఇప్పుడు ఆయన మరో కథ రెడీ చేసుకు ని షూటింగ్ కు వెళ్లే పని లో ఉన్నారు .. రీసెంట్ గా శ్రీవాస్ రవితేజ కు ఓ కథ చెప్పారు .. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో ఈ సినిమా మొదలు కావాలి .. అయితే ఇప్పుడే రవితేజసినిమా చేయటం లేద ని కూడా తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఆయన స్థానం లో మరో హీరో సందీప్ కిషన్ వచ్చి చేరినట్టు మరో వార్త బయట కు వచ్చింది .  ఫుల్ లెంగ్త్ పక్క ఎంటర్టైన్మెంట్ తో సాగే స్టోరీ అని ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్ ..


 అయితేఇప్ప‌టి కే డైరెక్టర్ శ్రీవాస్ ఈ స్టోరీ కి సంబంధించి న స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడ ట  .. సందీప్ కు ఫుల్ నారేషన్ ఇచ్చార ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి .. రీసెంట్ గానే మజాకా తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సందీప్ కిషన్ .. ఈ సినిమా కూడా అంతగా వర్కర్ కాలేదు .  అలాగే ఈ హీరో చేతి లో మ‌రో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి .. ఇక‌ అందులో ఫ్యామిలీ మెన్ 3 లోను సందీప్ నటిస్తున్నాడు .  అలాగే ఓ తమిళ సినిమా కూడా చేస్తున్నాడు .. అయితే ఇప్పుడు ఆ తమిళ సినిమా తో సమాంతరం గా శ్రీవాస్  సినిమా ని మొదలు పెట్టే అవకాశం ఉంది .. అలాగే త్వరలో నే ఈ కాంబో కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయట కు రాబోతున్నాయ ని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: