- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న మరో మూవీ హిట్ 3 గతంలో వచ్చిన రెండు భాగాల కు నాని కేవలం నిర్మాత గానే ఉన్నారు .. అయితే ఈసారి మాత్రం హీరో గా కూడా తానే ఉన్నాడు కాబట్టి అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి .. అలాగే ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర రక్తం ఏరులై పారుతుంద ని టీజర్ చూస్తే అర్థమైంది .. అయితే ఇలాంటి సినిమాల కు సెన్సార్ బోర్డు దగ్గర గట్టి ఇబ్బందులు ఉంటాయి .. అయితే నాని ముందు గానే జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తుంది .. మే 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది .  అయితే విడుదలకు వారం రోజుల ముందు సెన్సార్ ఉంటుంది .. ఇక హిట్ 3 కి మాత్రం మూడు వారాల ముందు సెన్సార్ పూర్తి చేయాల ని చూస్తున్నారు ..


 ఎందుకంటే సెన్సార్ దగ్గర ఏవైనా ఇబ్బందులు వస్తే కవర్  చేసుకొని ,  మళ్లీ ఎడిట్ చేసుకోనే టైం ఉంటుంది . లేదంటే రివైజింగ్ కమిటీ కి వెళ్లే సమయం కూడా ఉంటుంది .. అందుకే ముందు గా సెన్సార్ చేయించు కోవాలని చూస్తుంది చిత్ర యూనిట్ .. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే గ‌త శుక్రవారం ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్లిందని తెలుస్తుంది ... అయితే ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఇంకా ఎటు తేల్చుకోలేక పోతున్నారట .. ఈ సినిమాకు భారీగా కట్స్ పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది .. ఒకవేళ ఎక్కువ  క‌ట్స్ పడితే అప్పుడు రివైజింగ్ కమిటీ కి వెళ్లాలి కొన్ని  క‌ట్స్ అయితే ఏదోలా సర్దుబాటు చేసుకోవచ్చని టీం భావిస్తుంది .  వచ్చే సోమవారం లోగా సెన్సార్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: