
ఈ చిత్రానికి హృతిక్ రోషన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు గత మూడు భాగాలలో కూడా హీరోగా నటించగా.. క్రిష్ 4 లో తానే దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటివరకు హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా కలిసి పలు చిత్రాలలో కూడా నటించారు వీరిద్దరిది కూడా బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ కావడం చేత క్రిష్ 4 లో కూడా ఆమెని తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్ కాంబినేషన్లో క్రిష్, అగ్నిపత్, క్రిష్ 3 వంటి చిత్రాలను నటించారు.
క్రిష్ -4 లో కూడా ప్రియాంక చోప్రా పాత్ర కీలకంగా ఉంటుందని.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెద్దగా ఉండడంతో ఈమె క్రేజ్ కి తగ్గట్టుగా సినిమాలు కూడా ఇతర దేశాలలో విడుదలవుతే కచ్చితంగా సినిమాలకు కూడా క్రేజీ ఉంటుందని భావనతోనే చాలామంది ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారట. ఎన్నో ఏళ్ల ఇండస్ట్రీలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు సరికొత్త బెస్ట్ ప్రాజెక్టులతో మళ్ళీ తిరిగి కం బ్యాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. భారీ VFX తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది మరి డైరెక్టర్ గా హృతిక్ రోషన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి అఫీషియల్ గా చిత్ర బృందం ప్రకటిస్తుందేమో చూడాలి.