ఓటీటిలో సినిమాలు ఈ మధ్యకాలంలో కొదవ లేకుండా వస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా చాలా భాషలలో విడుదల అయ్యి ఓటీటిలో అన్ని భాషలలో స్ట్రిమింగ్ అవుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తీసుకువచ్చేలా చేస్తూ ఉన్నాయి. పాన్ ఇండియా లేవల్లో విడుదలై సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటిటి లవర్స్ ఎక్కువగా చూసే సినిమాల లిస్టులో హర్రర్, రొమాంటిక్ త్రిల్లర్ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక సినిమా ఆడియన్స్ సైతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది ఈ సినిమా రొమాంటిక్ మాత్రమే కాకుండా ఒక థ్రిల్లర్ ఫాంటసీ చిత్రంగా తీశారు.


సినిమా చూసిన వారందరూ కూడా ఈ సినిమా ఏంటి రా బాబు ఇలా ఉంది అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన రొమాంటిక్ చిత్రాలలో ఇది చాలా డిఫరెంట్ గా ఉన్నది.. ఈ సినిమా పేరు మార్జర ఒరు కల్లువచ్చనున. ఈ సినిమా మలయాళం సినిమా అయినప్పటికీ కూడా ఈ సినిమా సైనా ప్లే OTT లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ఆంటీ లవర్. హీరో తెలివిగా దొంగతనాలు చేస్తూ ఉన్నప్పటికీ అయితే ఆంటీలను ఎక్కువగా లైన్లో పెడుతూ ఉంటాడు.


అది కూడా డబ్బున్న ఆంటీలను మాత్రమే టార్గెట్ చేస్తూ వారిని వలలో వేసుకొని వారి ఇంట్లో దొంగతనాలు ఉంటాడు. అలాంటి  సమయంలో ఒకసారి ఊహించని సంఘటన హీరోకి ఎదురవుతుంది. దీంతో అతను ఊరు వదిలేసి పారిపోవాల్సి వస్తుంది.. అలా పారిపోయిన హీరో ఒక ఇంట్లో తదాచుకుంటారు ఆ ఇంట్లో కూడా అతనికి కొన్ని ఊహించని సంఘటనలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఈ చిత్రంలోని కథకు రామాయణంలోని అహల్య మోక్షం కథను సైతం డైరెక్టర్ లింక్ చేసిన విధానం అద్భుతంగా ఉన్నది. అలాగే ఆ ఇంట్లో ఉండే రహస్యాలను సైతం తాను బయటికి తీస్తూ ఉంటారు అలాంటి సమయంలోనే ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: