
కథ :
ఒక వ్యక్తి ఒక తాతకు తన గతం గురించి చెప్పడంతో ఈ సినిమా మొదలవుతుంది. తక్కువ కులానికి చెందిన కౌసల్య (సునీతా మనోహర్) కొడుకైన రాఘవ (రాజేష్) ధనిక కుటుంబానికి చెందిన కావ్య (శ్రావణి శెట్టి) తో ప్రేమలో పడతారు. అయితే కుల మత బేధాల వల్ల ఈ కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. పంచాయతీ ద్వారా ఈ ప్రేమ జంట విడిపోవాల్సి వస్తుంది. అయితే ఆ తర్వాత ఈ జంట జీవితంలో చోటు చేసుకున్నమలుపులు ఏంటి ? చివరకు ఏమైంది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
దర్శకుడు స్వామి పట్నాయక్ హీరో తల్లి కౌసల్య పాత్ర చుట్టూ కథను నడపటం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కొడుకును ఒంటరిగా పెంచిన కౌసల్య పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. చదువు ద్వారానే పేదరికం నుంచి బయటపడవచ్చనే మెసేజ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని కచ్చితంగా చెప్పవచ్చు.
తల్లి ఆశయమైన చదువును హీరో నెరవేర్చిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కుల, మత భేదాలకు అతీతంగా మానవత్వం ముఖ్యమనే మెసేజ్ సినిమాకు ప్లస్ అయింది. హీరో విలన్ తండ్రిని కాపాడి, అతనిలో మార్పు తీసుకొచ్చే సీన్ ఎంతో బాగుంది. కొన్ని సన్నివేశాలు మాస్ ప్రేక్షకుల కోసం తీసినట్లుగా ఉన్నా అవి కూడా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్, బీజీఎం సినిమాకు ప్లస్ అయ్యాయి. రాజేష్ కొంచాడా రాఘవ పాత్రలో అదరగొట్టగా అతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. కౌసల్య పాత్రలో సునీతా మనోహర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో మెప్పించారు. బోస్ తాత, కాలేజీ విలన్ గ్యాంగ్ వంటి ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
రేటింగ్ : 3.0/5.0