టాలీవుడ్ నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసిన త్రిష తన సినిమాల ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన నటన అందచందాలతో కుర్ర కారు మతులు పోగొట్టింది. ఇక ఈ చిన్నదాని నటనకు ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. త్రిష వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలో కొంతమంది హీరోలతో ఈ బ్యూటీ ఎఫైర్లు పెట్టుకున్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇంతవరకు త్రిష ఎవరిని వివాహం చేసుకోలేదు. 


కానీ కొంతమంది హీరోలతో ఎఫైర్లు కొనసాగించినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా, త్రిష సోషల్ మీడియా వేదికగా నిన్న తన ఆవేదనను వ్యక్తం చేసింది. నెగిటివిటీని ప్రచారం చేసే వారి గురించి మాట్లాడుతూ త్రిష సీరియస్ అయ్యారు. అయితే త్రిష సోషల్ మీడియా వేదికగా అంత సీరియస్ అవ్వడానికి కారణం నటి నయనతార అని ఓ ప్రచారం జరుగుతోంది. త్రిష తాజాగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. ఇందులో అజిత్ హీరోగా నటించాడు. కాగా, ఈ సినిమా విడుదలై భారీగా కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ సినిమాలో త్రిష అద్భుతంగా నటించిందని, తన నటన చాలా బాగుందని అభిమానులు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు.


లేడీ సూపర్ స్టార్ అంటే కేవలం త్రిష మాత్రమేనని చెబుతున్నారు. ఇలా చెప్పడంతో నయనతార అభిమానులకు కోపం వస్తోంది. ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ కనీసం డబ్బింగ్ కూడా చెప్పడం రాదని వేరే వారిపై త్రిష ఆధారపడుతుందని ఆమె నటన కూడా పెద్దగా బాగుండదు అంటూ నయనతార అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో త్రిష కోపం వచ్చి నయనతార అభిమానులను లక్ష్యంగా పెట్టుకొని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.


ఇలా చేయడం పిరికితనం కిందికి వస్తుందని గాడ్ బ్లెస్స్ యు అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్న వారికి త్రిష ఘాటుగా సమాధానం ఇచ్చింది. అయితే టాక్సిక్ అనే సినిమాలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో టాక్సిక్ అనే పదాన్ని త్రిష పోస్ట్ లో షేర్ చేసుకోవడంతో నయనతారను తన అభిమానులు విమర్శించినందుకే త్రిష ఈ పోస్ట్ పెట్టిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: