ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే గాయపడిన విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతోంది. సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉన్నారు. తన కుమారుడికి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన పర్యటన పూర్తయిన వెంటనే సింగపూర్ కి వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు అయ్యాయి.



అవి కూడా చిన్నపాటి గాయాలే అయ్యాయని తెలిసి ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నల్ల పొగ విపరీతంగా వచ్చింది. దాంతో మార్క్ శంకర్ నల్లపొగను పీల్చడం వలన అనారోగ్యం పాలయ్యాడు. దీంతో శంకర్ కు వైద్యులు తగిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి కూడా పొగ చేరడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే బ్రోన్కో స్కోపి అనే ట్రీట్మెంట్ ని మార్క్ శంకర్ కి అందించినట్లుగా సమాచారం అందుతుంది.

ఈ ట్రీట్మెంట్ అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు. లక్షల్లో ఖర్చు అవుతుందని చాలామంది అంటున్నారు. లంగ్స్ లో చేరిన విషవాయువుని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని వదలడం కోసం దీనిని చేస్తారు. అయితే పరిస్థితి తీవ్రతను బట్టి ఏ తరహా బ్రోన్కో స్కోపీ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డాక్టర్స్ నిర్ణయిస్తారని భావిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మార్క్ శంకర్ కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. మార్క్ శంకర్ తో పాటు ప్లే స్కూల్ లో గాయపడిన విద్యార్థులు అందరూ క్షేమంగా కోలుకొని బయటకు రావాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: