హీరోయిన్లు నేటి కాలంలో చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వైపుకు వెళ్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్లు సైతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో నటి జాన్వి కపూర్ ఒకరు. శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక టాలీవుడ్ ఇండస్ట్రీకి వైపుకు వచ్చింది. ఇక ఈ చిన్నది తెలుగులో దేవర సినిమాతో నటిగా తనను తాను పరిచయం చేసుకుంది.


దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. దేవర సినిమాలో తన అందచందాలకు అభిమానులు ఎంతగానో ఫిధా అయ్యారు. ఈ సినిమా అనంతరం జాన్వి కపూర్ తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటుంది. ప్రస్తుతం జాన్వి కపూర్ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే "పెద్ది" సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఓవైపు నటిస్తూనే మరోవైపు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది.

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

జాన్వి కపూర్ వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని షేర్ చేసుకోగా.... అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో తన పెట్ తో కలిసి ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను జాన్వి కపూర్ తన అందాలను ఆరబోసి హాట్ గా ఫోటోలు దిగింది. ఇక తన పెట్ తో ఫోటోలు తీసుకుంటూ ఎగ్జిైటెడ్ ఫర్ న్యూ బిగినింగ్స్ అని రాసుకోచ్చింది. ఈ ఫోటోలు చూసిన చాలామంది ప్యాంటు లేకుండా ఫోటోలు తీసుకోవడం అవసరమా అని నెగెటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. వీటిపై జాన్వి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: