
ముఖ్యంగా సిటీలో ఉండే రౌడీ షీటర్స్, క్రిమినల్స్ టాప్ టెన్ లిస్ట్ కావాలని పోలీస్ ఆఫీసర్ అడగగా.. ఇక్కడ టాప్ టెన్ ఉండదు సార్.. వన్ టు టెన్ ఒక్కడే.. అది అర్జున్ అంటూ కళ్యాణ్ రామ్ మాస్ ఎలివేషన్స్ తో సాగర్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక మీ కింద పనిచేయాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ మీ పెంపకంలో పెరిగిన మీ కొడుకు అర్జున్ ఏంటి మేడం ఇలా క్రిమినల్ గా మారాడు అంటూ చెప్పే డైలాగ్స్ సినిమా పై హైప్ పెంచేసాయి.
ఇక కొడుకును ఆయుధంలా పెంచి యుద్ధం చేయొద్దు అంటే ఎలా మేడం అనే డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికైతే తల్లి కొడుకుల నేపథ్యంలో రాబోతున్న ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి అటు కల్యాణ్ రామ్ కు మంచి విజయాన్ని, ఇటు విజయశాంతికి మంచి కం బ్యాక్ ఇవ్వబోతున్నాయని చెప్పవచ్చు.