మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీవార్ 2 “.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమా లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించునున్నారు.. అయితే ఎన్టీఆర్ పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది..

ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయి.. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ సాంగ్ చేయనున్నారు.. ఎన్టీఆర్సినిమా షూటింగ్ కోసం చాలా సార్లు ముంబై కి వచ్చి వెళ్తూ వున్నాడు.. అయితే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్ ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో ప్లాన్ చేసిన సాంగ్ కోసం హృతిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కాలు కాస్త బెనకడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.. అయితే మేకర్స్ మిగిలిన సీన్స్ షూట్ చేసుకుంటూ వచ్చారు.. త్వరలోనే ఆ సాంగ్ కూడా పూర్తి చేయనున్నారు..

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. తారక్ నుంచి చాలా నేర్చుకున్నాను.. తారక్ అద్భుతమైన నటుడు. తన నటనకు ఎంతగానో ఫిదా అయ్యాను అని హృతిక్ తెలిపారు..అలాగే తన ఫేవరెట్ కో స్టార్ తారక్ అని హృతిక్ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: