మెగా హీరో రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. తాను నటించిన సినిమాలలో చాలావరకు సినిమాలు మంచి విజయాలను అందుకోగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అయినప్పటికీ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానులను అలరిస్తూనే ఉంటాడు.


ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఫలితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ యాడ్స్ షూటింగ్ లలోను చురుగ్గా పాల్గొంటారు.


ఈ నేపథ్యంలోనే ఈ మెగా హీరో రిలయన్స్ కు చెందిన శీతల పానీయాల బ్రాండ్ "కాంపా" కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రిలయన్స్ సంస్థ అనౌన్స్ చేసింది. మెగా హీరో రామ్ చరణ్ తో భాగస్వామ్యం తమ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రిలయన్స్ సంస్థ వెల్లడించింది. "కాంపా వాలీ జిద్" పేరిట ఆయనతో ఓ యాడ్ ను రూపొందించారు. కాంపా బ్రాండ్ మార్కెట్లోకి వచ్చి కేవలం రెండు సంవత్సరాలే అయినప్పటికీ లాభాల బాటలో దూసుకుపోతోందని రిలయన్స్ సంస్థ వెల్లడించారు.

 అత్యంత ఎక్కువ లాభాలు సంపాదిస్తూ కాంపా బ్రాండ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఇక కాంపా బ్రాండ్ కు రామ్ చరణ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఈ లాభాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ సంస్థ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు ఈ బ్రాండ్ ను తప్పకుండా స్వీకరిస్తారని సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: