బిగ్ బాస్ లోకి రాకముందే గీతూ రాయల్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. కానీ బిగ్ బాస్ కు వచ్చాక మరింత పాపులర్ అయింది.ఇక బిగ్ బాస్ లో తన చెత్త ఆటతో చాలామందిని ఇరిటేట్ చేయించి ఈ కంటెస్టెంట్ ఎప్పుడు బయటకు వెళ్తుందా అని ఈమె పై ట్రోలింగ్ కూడా జరిగింది. అంతేకాదు బిగ్ బాస్ లో ఈమె ఆటను చాలా మంది వ్యతిరేకించారు. చివరికి విన్నర్ అవుతుంది అనుకున్న గీతూ రాయల్  ఎలిమినేట్ అయింది. అయితే అలాంటి గీతూ రాయల్ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు బయట పెట్టింది. గీతూ రాయల్ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ హౌస్ లో బాలాదిత్యకు సిగరెట్ ఇవ్వని కారణంగా ఎలిమినేట్ అయ్యాను. 

అయితే నేను చేసింది మంచి పనే. ఎందుకంటే ఆయన  హెల్త్ కాపాడడం కోసమే సిగరెట్స్ ఇవ్వలేదని తెలిసి కూడా నన్ను బయటికి పంపించారని తెలిశాక నాకు మైండ్ పిచ్చెక్కిపోయింది. అందుకే మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఆఫర్ ఇచ్చిన వెళ్లాలనిపించలేదు. ఇక బిగ్ బాస్ బజ్ చేసేటప్పుడు మా ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. దానివల్ల నా మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. ఆ టైంలో తల గోడకేసి బాదుకోవాలనిపించింది. నా మీద జోకులు వేసినా కూడా ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నవ్వాను.

కానీ ఒకవేళ నేను చనిపోతే మాత్రం వీడియో తీసే ఎందుకు చనిపోవాలనుకుంటున్నానో చెబుతాను. ఇక నా భర్తతో నాకు నిజంగానే గొడవలు ఉన్నాయి. కానీ అవి చిన్న చిన్న గొడవలే. ప్రస్తుతం నా భర్త వికాస్ నేను కలిసే ఉన్నాం. మేం విడాకులు ఏమి తీసుకోలేదు. అయితే ఇస్మార్ట్ జోడిలో ఛాన్స్ వచ్చిన సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్న టైంలో స్టేజ్ మీద కలిసి ఉన్నట్టు నవ్వుకుంటూ ఎలా నటించగలం. అందుకే ఆ షో కి రాలేదు.కానీ మేమిద్దరం విడిపోలేదు అంటూ గీతూ రాయల్ భర్తతో గొడవ పై క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: