ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రాక్ స్టార్ యష్ హీరోగా నటించిన కే జి ఎఫ్ 1, కే జీ ఎఫ్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఎంతలా షేక్ చేశాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రిజల్ట్ చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయారు. అలా ఏమాత్రం పేరు ప్రఖ్యాతలు లేని కన్నడ హీరో యష్ కే జీ ఎఫ్ సినిమా తో ఇండియా లోనే బిగ్గెస్ట్ హీరోల సరసన నిలబెట్టారు అంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కే జి ఎఫ్ 1, కే జీ ఎఫ్ 2 సినిమాలకి కైకాల సత్యనారాయణ తో ఉన్న సంబంధం ఏంటి అని చాలామంది లో ఒక అనుమానం అయితే ఉంది. మరి కేజీఎఫ్ 1, 2 సినిమాలకి కైకాల సత్యనారాయణ కి మధ్య ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కే జి ఎఫ్ 1 కేజీఎఫ్ 2 సినిమాల తెలుగు రైట్స్ ని కైకాల సత్యనారాయణ కొడుకు కైకాల లక్ష్మీ నరసింహ పోటీపడి మరీ దక్కించుకున్నారట. అయితే ఈ సినిమాకి తెలుగులో సాయి కొర్రపాటి నిర్మాతగా అలాగే కైకాల సత్యనారాయణ కొడుకు కైకాల లక్ష్మీ నరసింహ సహనిర్మాతగా చేశారు. అందుకే కేజిఎఫ్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కైకాల సత్యనారాయణ సమర్పించు అనే టైటిల్ కార్డు పడటం మనం చూస్తూ ఉంటాం.

అయితే కేజీఎఫ్ సినిమా ఎలా ఉంటుందో ముందుగానే ఊహించిన కైకాల సత్యనారాయణ తనయుడు అందరికంటే ముందుగానే ఈ సినిమా తెలుగు రైట్స్ ని కొనడానికి ఆసక్తి చూపించారట. అలా పోటీపడి మరీ ఈ చిత్ర రైట్స్ ని దక్కించుకున్న కైకాల సత్యనారాయణ కుటుంబానికి ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో దాదాపు 170 కోట్ల వరకు లాభాలు వచ్చాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: