
వైష్ణవి చైతన్య ఇతర హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ అందాల భామ తన నటన ప్రతిభను కనబరచింది. బేబీ సినిమాలో ఈమె ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడుపుతుంది. ఈ సినిమాలో హీరోలుగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ మూవీ మంచి హిట్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్ ని వసూలు చేసింది. ఈ సినిమా మొత్తం వైష్ణవి చైతన్యనే కనిపిస్తుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇక ఆ ఫోటోస్ ని చూసిన నెటిజన్స్ అబ్బబ్బా ఏం అందం ఏం అందం అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే మంచి ట్రీట్ ఇచ్చింది అంటూ పెడుతుంటారు.
ఈమె ఎప్పుడు తన స్టైలిష్, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ జాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటిస్తుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే ఈమె ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీ అనే హారర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఈ బ్యూటీ స్క్రిప్ట్ సెలెక్షన్ లో పొరపాటు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక నెటిజన్స్ మంచి అవకాశాలు వస్తున్నాయి ఇలా అయితే ఎలా బేబీ.. చూస్కోవాలిగా అంటున్నారు.