తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ ని కూడా బీట్ చేసేసింది. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇండియన్ సినిమాకి ఒక్క గొప్ప గుర్తింపు వచ్చే మార్గలో ప్రయాణిస్తున్నారు. సినిమానే లక్ష్యంగా జీవిస్తున్నారు. కథతో పాటుగా ఎమోషన్, పాత్రల సెలెక్షన్, టెక్నాలజీ అన్నీ పాన్ వరల్డ్ లెవెల్ లో తీస్తున్నారు.
 
ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరపైకి రానుంది. ఈ సినిమాలో ఆ 20 నిమిషాలు వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా తీయనున్నారు. సందీప్ రెడ్డి వంగా ఎనిమల్ సినిమాతో ఇటీవలే హిట్ కొట్టాడు. ఈ సినిమాలో సంగీతం కోసం సందీప్ రెడ్డి వంగాతో చాలా చర్చలు చేశారు. సందీప్ రెడ్డితో చేసిన ప్రతి సినిమా విజిల్ సౌండ్ కలిసి వస్తుందని తెలిసిందే. ఇక పాన్ ఇండియా దర్శకుడు.. పాన్ ఇండియా హీరో కలిసి చేసే ఈ సినిమాలా పైన ప్రేక్షకులు చాలానే అంచనాలు ఉన్నాయి.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ డార్లింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే కాదు.. ఇతర దేశాలలో కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: