
ఇక ఈ బ్యూటీ గతేడాది పెళ్లి చేసుకుంది. జాకీ భగ్నని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ గోవాలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఈ అందాల భామ గిల్లీ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాతో రకుల్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీకి ఈమె భర్త జాకీ భగ్ననే నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈమె దే దే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్, మాధవన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ భామ ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అంట. ప్రతిరోజూ వర్క్ కి వెళ్లడం, కెమెరా ముందు ఉండడం రకుల్ కి చాలా ఇష్టమైన పని అంట.
తాజాగా ఈ ముద్దుల గుమ్మ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఈ అందాల భామ ట్రెండీ డ్రెస్ లో కనిపించింది. పెళ్లి తర్వాత రకుల్ ఇలాంటి డ్రెస్ లో కనిపించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ పెళ్లి అయిన కూడా అందం మరింత పెరిగింది అంటూ కామెంట్స్ చేసుకున్నారు.