కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి లీడ్ రోల్ పోషిస్తూ ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్ ను విపరీతంగా మెప్పిస్తోంది. ముఖ్యంగా తల్లి కొడుకుల సెంటిమెంటుతో యాక్షన్, మాస్ పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరిగింది.. ఇదిలా ఉండగా నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆ లోటు తీరింది.. ఎప్పటికి రుణపడి ఉంటాము అంటూ కామెంట్లు చేశారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ వేదికపై నేను, అన్న ఉన్నప్పుడు మా నాన్న ఎన్నో సార్లు మా గురించి మాట్లాడారు.  ఇప్పుడు విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఆయన లేని లోటు తీరినట్లు అనిపించింది. చాలా మంది హీరోలు ఎంతో సాధించారు.. కానీ వాళ్లకు దీటుగా సినిమా ఇండస్ట్రీలో నిలిచిన మహిళ విజయశాంతి గారు మాత్రమే. ఆమె చేసిన సినిమాలు మరో హీరోయిన్ చేయలేదు. కర్తవ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్ కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది అనే ఐడియా తోనే ఈ మూవీ ఆలోచన వచ్చిందేమో.


సినిమా చూశాను. విజయశాంతి, పృథ్వీ, సోహెల్ ఖాన్ లేకపోతే ఈ సినిమా లేదు అనిపించింది.  ముఖ్యంగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి , నిర్మాతలు ఈ కథను ఎంతో నమ్మారు. చివరి 20 నిమిషాలకు థియేటర్లలో ప్రేక్షకులకు కచ్చితంగా కన్నీలాగవు. అంత అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు..ఈ మూవీ కళ్యాణ్ అన్న కెరియర్ లోనే ఒక స్పెషల్ గా నిలిచిపోతుంది అంటూ తెలిపారు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: