టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరుపొంది, ఆ తర్వాత విడిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచిన జంటలలో సమంతా - నాగచైతన్య కూడా ఒకరు. దాదాపు 7 ఏళ్లపాటు ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఈ జంట.. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకి విడిపోయారు. ఇక తర్వాత ఎవరి దారి వారిది అన్నట్టు బిజీ బిజీగా లైఫ్ లో గడిపేస్తున్న విషయం తెలిసిందే..ఒకవైపు సమంత హిందీలో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.. ఇక అలాగే ఇటు తెలుగులో కూడా ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను స్థాపించి, మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఇక అటు అక్కినేని నాగచైతన్య,  శోభితా ధూళిపాలను రెండవ వివాహం చేసుకొని వైవాహిక బంధాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు.  అంతేకాదు చివరిగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి... ఇప్పుడు షో యు అనే రెస్టారెంట్ ను కూడా ప్రారంభించి ప్రపంచం నలుమూలల ఉండే రుచికరమైన వంటలను ఇక్కడి హైదరాబాదు ప్రజలకు కూడా రుచి చూపిస్తున్నారు.. ఇకపోతే నాగచైతన్య , సమంత విడాకులు తీసుకున్నారు. కానీ వాటి విషయంలో ఎప్పుడూ తల్లిదండ్రులు గానే కలిసే ఉంటామని చెబుతున్నారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం


సమంత నాగచైతన్యాలకు శునకాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమించుకున్నప్పటి నుంచి పెళ్లయిన తర్వాత కూడా వీరి దగ్గర ఒక రెండు శునకాలు చాలా ప్రత్యేకంగా కనిపించేవి. అయితే ఈ మధ్య విడిపోయిన తర్వాత అవి వీరి మీద బెంగ పెట్టుకున్నాయో ఏమో కానీ కొన్ని రోజులు సమంత దగ్గర మరికొన్ని రోజులు నాగచైతన్య దగ్గర ఉంటున్నాయి. అందుకే వీరిద్దరూ విడిపోయిన సరే వీటి కోసమే అయినా తామిద్దరం కలిసి ఉండాలి అని ఈ జంట నిర్ణయించుకున్నారట.  అలా ఈ శునకాల కోసమే వీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: