టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ ఫ్యామిలీ సబ్జెక్టు తో వెంకీ మామ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. 300 కోట్ల గ్రాస్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న విక్టరీ వెంకటేష్ లో ఈ సినిమా ఫుల్ జోష్ తీసుకొచ్చింది..

గత ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమా తో డిసప్పాయింట్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో సక్సెస్ అందుకోవడంతో తను ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో పూర్తి క్లారిటీ వచ్చింది.సంక్రాంతికి వస్తున్నాం తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. 2026 సంక్రాంతికి మెగాస్టార్ సినిమాను అనిల్ రావిపూడి రిలీజ్ చేయబోతున్నాడు.అయితే వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని లాక్ చేయలేదు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి.. కానీ ఏది ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది..

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని వెంకీ మామ ఫిక్స్ అయ్యారని సమాచారం.దానికి తగినట్టుగానే ఆ తరహా కథలనే వింటున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కొన్ని కథలు విని ఓకే చెప్పినా వాటిలో ఏది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది... డైరెక్టర్స్ విషయం లో కూడా వెంకీ మామ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం..కథ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నాడట వెంకీ మామ.. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొత్తగా అనిపించే పాయింట్ తో రావాలని వెంకీ మామ చూస్తున్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: