నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కే జీ ఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

మూవీ నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలను గమనిస్తే ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు , అలాగే ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు అని తెలుస్తోంది.

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చింది అంటేనే అర్థం అవుతుంది ఈ మూవీ లో భారీ రక్తపాతం , యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని. నాని తన కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నాని భారీ రక్తపాతం ఉన్న సినిమాల్లో నటించలేదు. మరి తన కెరియర్లో మొట్ట మొదటి సారి నాని అత్యంత భారీ రక్తపాతం ఉన్న సినిమాలో కనిపించబోతున్నాడు. మరి హిట్ 3 మూవీ తో నాని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: