తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో  స్టార్ హీరోలకే ముచ్చమటలు  పట్టించిన  లేడీ హీరోయిన్ విజయశాంతి.. మాధవి, జయప్రద, జయసుధ, శ్రీదేవి, వంటి నటిమణులు సినిమాల్లో స్టార్లుగా ఎదిగిన సమయంలో ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వాళ్లకు గట్టి పోటీ ఇచ్చింది. చివరికి వాళ్లను కూడా దాటి లేడీ సూపర్ స్టార్ గా మారింది. ముందుగా గ్లామర్ పాత్రలు చేసిన విజయశాంతి ఆ తర్వాత మెల్లిగా కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుంటూ సినిమాల్లోకి దూసుకొచ్చింది. ఈమెకు అత్యంత పేరు తీసుకువచ్చిన సినిమా 'నేటి భారతం'. ఇక ఈ మూవీ తర్వాత విజయశాంతి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలాంటి విజయశాంతిని లేడీ అమితాబ్ గా కూడా పిలుస్తారు. అలాంటి విజయశాంతి కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 

అయితే ఆయనకు నందమూరి కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది.. శ్రీనివాస ప్రసాద్ ఎన్టీఆర్ పెద్ద అల్లుడైనటువంటి గారపాటి గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు.. అలా కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ లకు విజయశాంతి వరుసకు వదిన అవుతారు.అయితే శ్రీనివాస్ ప్రసాద్  బాలకృష్ణకు మంచి స్నేహబంధం ఉండేది. అప్పట్లో వీరిద్దరూ కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో నిప్పురవ్వ అనే సినిమాను తీశారు. ఇందులో విజయశాంతిని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా సమయంలోనే శ్రీనివాస ప్రసాద్ విజయశాంతితో పరిచయం పెంచుకొని అది కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో బాలకృష్ణ వీరిద్దరి లవ్ ను కాస్త విభేదించారు విజయశాంతి గురించి శ్రీనివాస ప్రసాద్ కొన్ని విషయాలు చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 

దీనికి తోడు షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి స్పాట్ లోనే చనిపోవడంతో సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇదంతా బాగాలేదని బాలకృష్ణ శ్రీనివాస ప్రసాద్ కు వ్యతిరేకంగా తాను నటించినటువంటి బంగారు బుల్లోడు సినిమాను తీసుకొచ్చారు. దీంతో నిప్పు రవ్వ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇదంతా పక్కన పెడితే  విజయశాంతి అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో చెల్లెలుగా సత్యం శివం సినిమాలో కూడా నటించింది. అంతేకాకుండా బాలకృష్ణతో కూడా చేసింది. ప్రస్తుతం మూడవ తరం హీరోలైన కళ్యాణ్ రామ్ కు అమ్మగా చేయడం కోసం మెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: