టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ప్రియదర్శి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రియదర్శి ఈ మధ్యకా లంలో వరస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈయన మల్లేశం అనే సినిమాలో హీరో గా నటించి మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు బలగం అనే సినిమాలో హీరోగా నటించి సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక కొంత కాలం క్రితం ఈయన డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన కోర్టు మూవీ లో హీరో పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ప్రియదర్శి , ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సారంగపాణి జాతకం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే తేదీన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అర్జున్ S/O వైజయంతి సినిమా కూడా విడుదల కానుంది. దానితో ఈ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంటుంది అని చాలా మంది భావించారు.

కానీ సడన్ గా సారంగా పారిజాతకం మూవీ విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేశారు. ఏప్రిల్ 25 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ప్రియదర్శిమూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: