టాలీవుడ్ లో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా  మణి శర్మ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన మ్యూజిక్ అందించిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. అలాంటి మణి శర్మ  మహేష్ బాబు సినిమాలకు ఎక్కువ శాతం మ్యూజిక్ అందించారు. ఇందులో కొన్ని చిత్రాలు  ఫ్లాప్ అయినా కానీ మ్యూజిక్ పరంగా  అద్భుతమైన హిట్ సాధించాయి. అలా మహేష్ బాబు తో వరుస సినిమాలు చేయడం వల్ల వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ముఖ్యంగా అర్జున్, ఖలేజా, పోకిరి, మురారి, ఒక్కడు, అతడు, వంటి చిత్రాలకు మణి శర్మ మ్యూజిక్ ఇచ్చాడు. 

చివరగా కలేజా తర్వాత మహేష్ బాబుకు మణి శర్మ మ్యూజిక్ చేయలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సరి పెట్టుకున్నాడు. అలా ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం ఏంటనేది మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో పాల్గొన్న ఈయన  అసలు మహేష్ నన్ను ఎందుకు దూరం పెట్టారో ఇంతవరకు తెలియదు. మా ఇద్దరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో వచ్చాయి. 

పొరపాటున నేను ఏదైనా తప్పు చేసి ఉంటానని నాకే అనిపిస్తోంది. మే బీ నా తప్పు అయి ఉండొచ్చు అంటూ  చెప్పుకొచ్చారు. నేను ఆ తప్పు గురించి వెతికే ప్రయత్నం కూడా చేయలేదు, అలాగే మహేష్ బాబు కూడా నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పే ప్రయత్నం చేయలేదు.. అలా మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది.కానీ మా ఇద్దరి మధ్య గ్యాప్ అలానే కంటిన్యూ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూ విన్న మహేష్ అభిమానులు  మీ ఇద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రావాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: