కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొంత కాలం క్రితం అజిత్ "విడ ముయర్చి" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో అజిత్ కి జోడీగా త్రిష నటించింది. ఈ మూవీ ని తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ ని తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. కానీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మాత్రం ఈ మూవీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇకపోతే తాజాగా అజిత్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు తమిళనాడు ఏరియాలో సూపర్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 2 రోజుల బాక్స్ ఆఫీసర్లను కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలు తెలుసుకుందాం.

2 రోజుల్లో ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 45.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.90 కోట్లు , కర్ణాటక ఏరియాలో 5.10 కోట్లు , కేరళలో 1.40 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 లక్షలు , ఓవర్సీస్ లో 24.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 38.40 కోట్ల షేర్ ... 79 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 77.60 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ మూవీ కి రెండు రోజుల్లో తమిళనాడు మరియు ఓవర్సీస్ ఏరియాలలో మంచి కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak