
పైగా గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపి జరిపించారు వైద్యులు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన కొడుకు మార్క్ శంకర్ అలాగే భార్య అన్నా లెజినోవాను వెంటబెట్టుకొని మరి హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయన.. మరొకవైపు అభిమానులను మెప్పించడానికి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే తొమ్మిదవ తేదీన ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ప్రస్తుతం గత నాలుగు రోజులుగా సింగపూర్ లోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైదరాబాద్ కి చేరుకున్నారు.. ఇక ఇప్పుడు తన సినిమా షూటింగ్ ప్రమోషన్స్ లో పాల్గొంటారా లేక ప్రజాపాలనలో మునిగిపోతారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మార్క్ శంకర్ ఇప్పుడు హైదరాబాద్కు చేరుకోవడంతో మార్క్ శంకర్ ని చూడడానికి అభిమానులు ఎగబడుతున్నట్లు సమాచారం.