కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గత కొన్ని రోజుల వరకు సినిమాలతో, వరుస విజయాలతో స్పీడు చూపించింది. కానీ ఆ స్పీడ్ కి కాస్త ఇప్పుడు బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు. బాలీవుడ్ లో జవాన్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఈమె కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది. కానీ ఎందుకో ఇదివరకు లాగా ఇప్పుడు అంత దూకుడు చూపించలేకపోతోంది. అంతేకాదు స్టార్ సినిమా ఆఫర్లు కూడా చాలా తగ్గిపోయాయి. ముఖ్యంగా టాప్ స్టార్ట్స్ ఒకరు కాకపోయినా మరొకరైనా.. నయనతారతో సినిమాలు చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గించేశారు.

అయితే జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న నయనతారకు సడన్గా బ్రేకులు పడడానికి కారణం ఆమె ధనుష్ తో పడిన గొడవే అని కొంతమంది వార్తలు గుప్పిస్తున్నారు. నయనతార పెళ్లి డాక్యుమెంట్రీపై ధనుష్ కేసు వేయడంపై,  తిరిగి నయనతార కూడా అదే రేంజిలో సోషల్ మీడియా ద్వారా అటాక్ చేసింది. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెడితే.. నయనతార,  ధనుష్ మధ్య దూరం పెరిగిందని అటు ఆడియన్స్ కి కూడా తెలిసింది.  ఈ క్రమంలోనే ధనుష్ వల్లే నయనతారకు అవకాశాలు రాకుండా పోతున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

నయనతార స్పీడ్ కి బ్రేకులు పడడానికి అసలైన కారణం ఏదో తెలియదు. కానీ ధనుష్తో గొడవ తర్వాతే ఆమె కెరియర్ ఇలా ఎఫెక్ట్ అయిందని మాత్రం చెప్పవచ్చు అని, ధనుష్ తో నయనతార కలిసి నటించినప్పుడు ఎలాంటి గొడవలు లేవు.  కానీ ఇప్పుడు విభేదాలు రావడం వల్లే నయనతార కెరియర్ పై ఎఫెక్ట్ పడుతోందని కామెంట్లు చేస్తున్నారు . ఇక మరి ఇప్పటికైనా నయనతార దీని నుంచి బయటపడి మళ్లీ ఎప్పటిలాగే బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: