
అయితే మహేష్ బాబు తీసుకున్న ఒక డెసీషన్ ఆయన కెరీయర్ కి మాయని మచ్చ గా మిగిలిపోయింది . మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద డిజాస్టర్ సినిమా "బ్రహ్మోత్సవం". అసలు ఈ సినిమా ఎందుకురా మహేష్ బాబు చేశాడు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా చాలా బాధపడ్డారు . అంతలా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది . నిజానికి ఈ సినిమాలో ముందుగా రామ్ చరణ్ ని హీరోగా అనుకున్నారట . కానీ రామ్ చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కథగా ఉన్న ఎక్కడో ఆ న్యాచురాలిటీ కోసం హీరోని తక్కువ చేసే ప్రయత్నం గా కధ ఉంది అంటూ చరణ్ ఈ సినిమా రిజెక్ట్ చేసారట .
ఆ తర్వాత ఈ సినిమా కోసం చాలామంది హీరోస్ వద్దకు ఈ కధ వెళ్లింది.. కానీ ఫైనల్లీ మహేష్ బాబు చేతికి వచ్చింది . మహేష్ బాబు టైం బ్యాడ్ ఏం చూసి ఈ కధను ఒప్పుకున్నాడో డిజాస్టర్ గా మారిపోయింది . ఇప్పటికి బ్రహ్మోత్సవం టీవీలో వస్తే జనాలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా చూడటానికి ఇష్టపడరు. అలాంటి చెత్త టాక్ మూట కట్టుకుంది. అలాంటి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా మహేశ్ బాబు కెరియర్ కి ఓ పీడ కల లాంటిది అని అంత అంటుంటారు..!!