
మరొకసారి అలాంటి స్పీచ్ ఇచ్చి స్టేజిపై హైలెట్ గా నిలిచారు జూనియర్ ఎన్టీఆర్ . మరీ ముఖ్యంగా నందమూరి అన్నదమ్ములు కలిసి ఒకే స్టేజిపై కనిపించడం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా అనిపించింది . అంతేకాదు తారక్ కూడా చాలా చాలా హుందాగా ఎంటర్టైనింగ్ గా మాట్లాడారు .అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ కూడా వదిలారు. అంతేకాదు తారక్ మాట్లాడుతున్న మధ్యలో కళ్యాణ్ రామ్ అన్న కాలర్ ని తమ్ముడు తారక్ ఎగరేశాడు . దీంతో ఆడిటోరియం చప్పట్లతో హోరెత్తిపోయింది. నాన్న హరికృష్ణ లేని లోటు ఈరోజు విజయశాంతి గారి వల్ల ఆమె మాటలు వల్లే తెలియలేదని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు .
దీంతో సోషల్ మీడియాలో దీనిపై హ్యూజ్ ట్రోలింగ్ మొదలైంది . సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎప్పుడు చేయరు . అయితే కళ్యాణ్ రామ్ సినిమా హిట్ అవ్వడానికి సినిమాని ప్రమోట్ చేయడానికి ఈ విధంగా కూసింత ఓవర్గా మాట్లాడారా ..? కాలర్ ఎగరేసి మాట్లాడాడా..? ఏంటి ..తన సినిమాల కోసం కూడా ఇంత ఓవర్ గా స్పీచ్ ఇవ్వలేడే అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. సినిమాని హిట్ చేసుకోవడానికి ఏదైనా చేసే లిస్టులలో కొంతమంది హీరోలు ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడా ..? అంటూ ఘాటు ఘాటుగా మాట్లాడుతున్నారు..!!