టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారి లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు . ఈయన దర్శకుడి గా కెరియర్ను ప్రారంభిం చిన కొత్తలో మంచి విజయాల ను అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించాడు . కానీ ఈ మధ్య కాలం లో మాత్రం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో రూపొందిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపడం లేదు . కొంత కాలం గ్యాప్ తీసుకొని ఈ దర్శకుడు ప్రియదర్శి హీరోగా వెన్నెల కిషోర్ , వైవా హర్ష ప్రధాన పాత్రల్లో సారంగపాణి జాతకం అనే సినిమాను రూపొందించాడు.

ఈ సినిమాను కొంత కాలం క్రితం ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా ఈ మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తూ ఈ మూవీ ని ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సెన్సార్ బోర్డు వారు ఈ సినిమా అద్భుతంగా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా క్రైమ్ కామెడీ జోనర్లో సాగబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రియదర్శి "కోర్ట్" అనే మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. మరి సారంగపాణి జాతకం మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: