టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే . దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ని చాలామంది జనాలు ఇష్టపడుతూ ఉంటారు. ఆయన నటన నచ్చి కొందరు.. ఆయన టాలెంట్ చూసి కొందరు. కానీ అందరికి ఆయనలో నచ్చేది మాత్రం.. కాంట్రవర్షియల్ కంటెంట్ ఏది టచ్ చేయడు . అసలు అది కాంట్రవర్షియల్ అవుతుంది అంటే అక్కడ మహేష్ బాబు ఉండనే ఉండడు.

కాంట్రవర్షియల్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు మహేష్ బాబు . అలాంటి మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు . మహేష్ బాబు సాధారణంగా ఎక్కడ కూడా తన ఫేవరెట్ పర్సన్ వాళ్లు వీళ్లు అంటూ ఓపెన్ అప్ అవ్వడు. తన సినిమా ప్రమోషన్స్ నిర్వహించుకుని వెళ్ళిపోతూ ఉంటారు . కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాత్రం నటన గురించి మాట్లాడుతూ ఆయనకు శ్రీదేవి గారి నటన తర్వాత అంతగా నచ్చిన నటన సౌందర్య గారిది అంటూ చెప్పుకు వచ్చారు .

అంతే కాదు సౌందర్య గారిలా ఎవరు నటించలేరు అని .. ఆమె ట్రెడిషినాలిటీ.. ఆమె నటన ఆమె హావభావాలు చాలా చాలా ఎంటర్టైనింగా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి అని .. ఆమె నటించిన సినిమాలు ఎక్కువగా చూడడానికి ఇష్టపడతాను అని ఒకానొక ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ప్రెసెంట్ మహేష్ బాబు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు . నిజానికి ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా షూటింగ్లో బిజీగా ఉండాలి . కానీ కొన్ని అనివార్య కారణాల చేత సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఈ గ్యాప్ లోనే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు..!


 

మరింత సమాచారం తెలుసుకోండి: