సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరికైతే మంచి విజయాలు తక్కుతాయో వారు అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇది హీరోయిన్స్ విషయంలో కూడా జరుగుతుంది. హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక వరుస విజయాలను అందుకుంటుందో ఆమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ , అద్భుతమైన అవకాశాలు దక్కుతూ ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస పెట్టి విజయాలను అందుకొన్ని అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు.

బ్యూటీ భీమ్లా నాయక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో పవన్ , రాణా హీరోలుగా నటించగా ... సంయుక్త మీనన్మూవీ లో రానాకి జోడిగా నటించింది. ఆ తర్వాత ఈమె నటించిన బింబిసార , సార్ , విరూపాక్ష సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈమె ఆఖరుగా డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఇప్పటివరకు సంయుక్త మీనన్ తెలుగులో ఐదు సినిమాల్లో నటిస్తే నాలుగు మూవీలతో మంచి విజయాలను అందుకుంది.

బ్యూటీ ప్రస్తుతం కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు మూవీలోనూ , బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 మూవీలోనూ నటిస్తుంది. ఈ రెండు మూవీలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సాధిస్తే సంయుక్త మీనన్ క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు మూవీలతో ఈ బ్యూటీ కి ఏ స్థాయి విజయాలు దక్కుతాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: